మాక్లూర్ లో అన్నదాన కార్యక్రమం

నవతెలంగాణ – మాక్లూర్
మండలంలోని పలు గ్రామాల్లో అయోధ్యలోని శ్రీరామ ప్రాణప్రతిష్ట సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో పండుగ వాతావరణం ఏర్పడింది. రామాలయల వద్ద అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం గ్రామాల్లో శోభయాత్రను చేపట్టారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బోర్గం (కే) గ్రామంలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచులు, గ్రామ కమిటీ సభ్యులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.

Spread the love