అడవిలో అగ్ని ప్రమాదాలను నివారించాలి..

Fire accidents should be avoided in the forest.– తాడిచెర్ల సెక్షన్ అధికారి లక్ష్మన్
– అడవుల రక్షణపై ప్రజలకు అవగాహన కార్యక్రమం. 
నవతెలంగాణ – మల్హర్ రావు
అడవిలో అగ్ని ప్రమాదాల నివారించాలని అటవీశాఖ తాడిచెర్ల సెక్షన్ అధికారి లక్ష్మన్ పశువుల కాపార్లను, రైతులను,ప్రజలను కోరారు.గురువారం మండలంలోని కొయ్యుర్  రేంజ్ పరిధిలోగల తాడిచెర్ల బిట్ పరిదిలో పశువుల కాపరులకు, గ్రామస్తులకు గత రెండుమూడు నుండి ముమ్మరంగా అవగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రేంజర్ మాట్లాడారు అటవీ రక్షణలో భాగంగా అటవీశాఖ ఆధ్వర్యంలో ఫైర్ లైన్లు చేస్తూ.. ప్రమాదాలు జరిగినప్పుడు ఫైర్ బ్లోయర్లతో నిప్పు ఆర్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ నష్టం పెద్దగా జరుగుతుందని తెలిపారు. వన్యప్రాణుల ఆవాసం చెదిరి విలువైన వృక్ష సంపద కనుమరువవుతుందని పేర్కొన్నారు. ప్రజల్లో చైతన్యం వస్తే అగ్ని ప్రమాదాలు నివారించవచ్చని తెలిపారు. చిన్నచిన్న చెట్లను మేతకు నరికితే చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీట్ ఆఫీసర్లు మహేందర్, పద్మ,అంజలి  గ్రామస్తులు పాల్గొన్నారు.
Spread the love