– కొయ్యుర్ రేంజర్ రాజేశ్వర్ రావు
నవతెలంగాణ – మల్హర్ రావు:
అగ్ని ప్రమాదాల నుంచి అడవులను రక్షించాలని కొయ్యుర్ రేంజర్ రాజేశ్వర్ రావు పిలుపునిచ్చారు బుధవారం మండల కేంద్రమైన తాడిచెర్లలోని మండల పరిషత్ కార్యాలయంలో మండల ఎంపిడిఓ శ్యాంసుందర్ అధ్యక్షతన పారెస్ట్,పంచాయతీ కార్యదర్సులు,ఈజిఎస్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. అడవుల రక్షణపై అవగాహన కార్యక్రమాన్నీ నిర్వహించారు.ఈ సందర్భంగా రేంజర్ మాట్లాడారు అడవిలో అగ్ని ప్రమాదం పర్యావరణానికి పెను ప్రమాదమని తెలిపారు.ప్రమాదవశాత్తు అడవుల్లో అగ్ని ప్రమాదాలు జరిగితే రక్షణ చర్యలు చేపట్టే విధానాలపై అవగాహన కల్పించారు. పచ్చి కొయ్యలతో మంటలు అర్పడం,ఫైర్ లైన్, బ్లోయర్ తో మంటలు అర్పడం,పెరుగుతున్న మొక్కలను ఫైర్ నుంచి రక్షించడం వంటి చర్యలు చేపట్టాలని వివరించారు ఈ కార్యక్రమంలో ఎంపిఓ విక్రమ్ కుమార్,సెక్షన్ అధికారి గొడుగు లక్ష్మన్,బిట్ అధికారులు,పంచాయతీ కార్యదర్శులు,ఈజిఎస్ సిబ్బంది పాల్గొన్నారు.