తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రైతు బాంధవుడు, బిఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 71వ జన్మదినం సందర్భంగా కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలోని గంప గోవర్ధన్ కార్యాలయం ఆవరణలో గంప గోవర్ధన్ చేతుల మీదగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో మొక్కలు నాటి, కేక్ కట్ చేసిన అనంతరం కేసీఆర్ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.