నవతెలంగాణ – హైదరాబాద్ : పల్నాడు జిల్లా వినుకొండలో ఓ మాజీ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌పై లైంగిక దాడి ఆరోపణల కేసు నమోదు కావడం హాట్ టాపిక్ అయింది. గతంలో వినుకొండ సీఐగా పనిచేసిన చిన్న మల్లయ్య తనపై లైంగికదాడి చేశారంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, వినుకొండ మండలం బ్రాహ్మణపల్లి సమీపంలో చిన్న మల్లయ్యకు చెందిన నాటు కోళ్ల ఫారాన్ని ఆమె అద్దెకు తీసుకుని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే చిన్న మల్లయ్య తనపై బలవంతంగా లైంగిక దాడికి పాల్పడినట్లు ఆమె తన ఫిర్యాదులో ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మహిళ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. అనంతరం బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ కేసు విచారణను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఒకప్పుడు శాంతిభద్రతల పరిరక్షణ బాధ్యతలు నిర్వర్తించిన అధికారిపైనే ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు రావడం చర్చనీయాంశంగా మారింది.
మహిళపై మాజీ సీఐ లైంగికదాడి..!
- Advertisement -
- Advertisement -



