మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపిన మాజీ కలెక్టర్ ఎస్ వెంకట్రావు..

నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
సకాలంలో ప్రజల సమస్యలను మీడియా ద్వారా తెలిపి సహకరించినందుకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలిపిన మాజీ కలెక్టర్ ఎస్ వెంకట్రావు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన బదిలీపై వెళ్తూ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూర్యాపేట జిల్లాలో పనిచేసిన అంతకాలం ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా వారు జిల్లాలో ఎక్కడ సమస్యలు తలెత్తిన వెంటనే కలెక్టర్ దృష్టికి వచ్చేలా చేసి అధికారులచే సమస్యను వెంటనే పరిష్కరించేలా తోడ్పడినందుకు అలాగే జరిగిన గత ఎన్నికల్లో తమ పూర్తి మద్దతు నుంచి ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేలా సహకరించినందుకు మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత కలెక్టర్ కూడా అదే మద్దతు కోపరేషన్ అందించాలని మాజీ కలెక్టర్ వెంకట్రావు మీడియా మిత్రులను కోరారు. ఆదివారం నాడు కలెక్టర్ విధుల నుండి రిలీవై, నూతన కలెక్టర్ తేజస్ నందాలాల్ పవర్ ఐఏఎస్ కు చార్జ్ అప్పగించడం జరిగిందని మాజీ కలెక్టర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో కలెక్టర్ సీసీలు, గన్ మాన్ లు తదితరులు పాల్గొన్నారు.

Spread the love