క్యాన్సర్ భాదితునికి సరుకులు, ఆర్థిక సహాయాన్ని అందించిన మాజీ లయన్స్ క్లబ్ అధ్యక్షులు

నవతెలంగాణ – తిరుమలగిరి
ప్రపంచ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం తిరుమలగిరి మండలం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా గుణానికి మారుపేరు, గ్రామీణ వైద్యుల సంఘం మండల అధ్యక్షులు, మాజీ లయన్స్ క్లబ్ అధ్యక్షులు  జలగం రామచంద్రయ్య గౌడ్  జన్మదినం  సందర్భంగా మండల కేంద్రంలోని తొర్రూర్ రోడ్డు పెట్రోల్ బంక్ పక్కనే ఉన్న ఇంట్లో క్యాన్సర్ బాధతో బాధపడుతున్న బాలుడిని సన్మానించి, కొంత ఆర్థిక సాయం అందించడంతో పాటు, కుటుంబానికి సరిపడ  నిత్యవసర వస్తువులు అందించి దాతృత్వాన్ని చాటారు.ఈ కార్యక్రమంలో ప్రస్తుత లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మందడి పద్మా రెడ్డి, కార్యదర్శి కందుకూరి లక్ష్మయ్య, కోశాధికారి డాక్టర్ సురేష్ కుమార్, లయన్ ఐతా శ్రీనివాస్, లయన్ డాక్టర్ సుందర్, తీపిరి శెట్టి లక్ష్మణ్, గణేష్, కృష్ణమాచారి, సంతోష్ లయన్ ఆర్ పి కాలియా తదితరులు పాల్గొన్నారు.

Spread the love