నవతెలంగాణ – మోపాల్
సోమవారం రూరల్ మాజీ ఎమ్ యల్ ఏ జన్మదినం సందర్బంగా బాజిరెడ్డి స్వా గృహములో ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు ఈగ సంజీవ రెడ్డిపూల గుచ్చాము ఇచ్చి శాలువాతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బాజిరెడ్డి జన్మదినం సందర్బంగా అయన నివాసం బి అర్ ఎస్ కార్యకర్తలతో కొలహలంగా మారింది. సంజీవ రెడ్డి తో పాటు బోర్గం మాజీ సర్పంచ్ ఈగ శ్రీనివాస్ రెడ్డి, బోర్గం బి అర్ ఎస్ గ్రామ అధ్యక్షులు నర్సారెడ్డి, బాల్ రెడ్డి, ఒలింపిక్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు గాధరి సంజీవరెడ్డి, బి అర్ ఎస్ మైనార్టీ యువ నాయకుడు సయ్యద్ నాభి తదితరులు పాల్గొన్నారు.