నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
శాసనసభకు రాష్ట్ర ప్రభుత్వం నలుగురు విప్‌లను నియమించింది. ఈమేరకు శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అండ్లూరి లక్ష్మణ్‌కుమార్ (ధర్మపురి), జాటోత్ రామచంద్రు నాయక్ (దోర్నకల్), ఆది శ్రీనివాస్ (వేములవాడ), బీర్ల ఐలయ్య (ఆలేరు)లను నియమించింది. చీఫ్‌విప్‌ను మాత్రం నియమించలేదు. ఆ పదవికి సంబంధించిన ఉత్తర్వులు శనివారం వెలువడే అవకాశం ఉన్నది. నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశంను చీఫ్‌విప్‌గా నియమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం.