లయన్ సహారా ఆధ్వర్యంలో మేఘన డెంటల్ కళాశాల వారి సహకారంతో ఉచిత దంత వైద్య శిబిరం శుక్రవారం నగరంలోని బీబీసీ హై స్కూల్ ఆవరణంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం చైర్మన్ లయన్ ఉదయ సూర్య భగవాన్ హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులు ప్రతిరోజు శరీరంలోని అన్ని భాగాలను శుభ్రపరచుకోవాలని అలాగే దంతాలను మరి ముఖ్యమైనవని తెలిపారు. ఆరోగ్యంగా ఉండాలని విద్యార్థులకు పలు సూచనలు తెలియజేశారు. డాక్టర్ ఆదిత్య మాట్లాడుతూ చిన్న వయసులో గల విద్యార్థులు దంతాలపై వచ్చే రోగాల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని క్లుప్తంగా వివరించారు. క్లబ్ అధ్యక్షుడు లయన్ నరసింహారావు, కార్యదర్శి లయన్ ధనుంజయ రెడ్డి, డిస్ట్రిక్ట్ చైర్ పర్సన్ లయన్ ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులు, డాక్టర్ శ్రావ్య బృందం తదితరులు పాల్గొన్నారు.