పశువులకు ఉచిత టీకాలు..

నవతెలంగాణ – మాక్లూర్ 
మండల కేంద్రంలోని మదన్ పల్లి, మదన్ పల్లి క్యాంపు గ్రామాలలో పశు వైద్య, పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఆవులకు, గేదెలకు గొంతు నొప్పి, జబ్బా  వాపుటీకాలు డా. కిరణ్ దేశ్ పాండే శుక్రవారం వేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. సిజనల్ వ్యాధులకు సంబంధించి పశువులకు వచ్చే  గొంతు నొప్పి, జబ్బా వాపు టీకాలు పశు వైద్య కేంద్రంలో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. తొలకరి జల్లులు పడగానే క్లాస్ట్రీడియం అనే బ్యాక్టీరియా విడుదల చేసే విష పదార్థం వల్ల వ్యాధి వస్తుందని ,చీటుక వేసినంత కాలంలోనే విష పదార్థం విడుదల రావడం వలన జీవాలు చనిపోతాయి.  పశుపోషకులు ,రైతులు తమ జివాలకు టీకాలు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో విఎల్ఓ వినీత, విఏ అహ్మద్ పాషా, జైల్ సింగ్, రైతులు,  తదితరులు పాల్గొన్నారు.
Spread the love