గొర్రెల పంపిణీ కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాలి 

నవతెలంగాణ – రామారెడ్డి 
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుపరచాలని, అధికారంలోకి వస్తే గొర్రెల పెంపకం దారులు అందరికీ రెండు లక్షల నగదు బదిలీ చేస్తామని ఇచ్చిన మాటను అమలు చేస్తూ బడ్జెట్లో గొర్రెల పంపిణీకి నిదురి కేటాయించాలని మంగళవారo కురుమ యువ చైతన్య సమితి వ్యవస్థాపక సభ్యులు చెలిమేటి గంగాధర్ కురుమ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. గొర్రెల పెంపకం దారుకు, గొర్రెలకు భీమా కల్పించాలని, 50 సంవత్సరాలు దాటిన కురుమలకు రు 5000 పింఛన్ ఇవ్వాలని, మేత కోసం ప్రతి గ్రామంలో 20 ఎకరాల ప్రభుత్వ భూముల్లో గడ్డి పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Spread the love