Monday, January 5, 2026
E-PAPER
Homeజాతీయంసీఐటీయూ బలోపేతానికి మరింత కృషి అవసరం

సీఐటీయూ బలోపేతానికి మరింత కృషి అవసరం

- Advertisement -

కార్యదర్శి నివేదికపై తపన్‌ సేన్‌ సమాధానం
మహాసభలో కార్యదర్శి నివేదికకు ఏకగ్రీవ ఆమోదం

విశాఖపట్నం నుంచి నవతెలంగాణ ప్రతినిధి ఎస్‌.వెంకన్న

సీఐటీయూని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు జాతీయస్థాయిలో మరింత కృషి అవసరమని సీఐటీయూ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ నొక్కి చెప్పారు. సీఐటీయూ 18వ అఖిల భారత మహాసభలో కార్యదర్శి నివేదిక, ప్రత్యామ్నాయ కార్యాచరణ ముసాయిదాలపై మూడు రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన చర్చలకు ఆదివారం ఆయన సమాధానం ఇచ్చారు. అనంతరం కార్యదర్శి నివేదికను మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. జాతీయ, అంతర్జాతీ యంగా నెలకొన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో కార్మిక వర్గ పోరాటాలను మరింత విస్తరించాలని పిలుపునిచ్చారు. కార్మిక వర్గంలో సీఐటీయూ జోక్యం క్షేత్రస్థాయిలో పెరగాలని సూచించారు. ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరించటంతోనే విస్తృత కార్మిక వర్గాన్ని ఏకం చేయగలమని అన్నారు. సంఘం జోక్యం కేవలం పని ప్రదేశాలకే పరిమితం కాకుండా నివాస ప్రాంతాలకు కూడా విస్తరించాలని పిలుపునిచ్చారు. సంఘం బలోపేతం అత్యంత ముఖ్యమైనదనీ, దీనికి సరైన ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు. దేశంలో పెరుగుతున్న కాంట్రాక్టీకరణపై దృష్టి పెట్టాలనీ, కాంట్రాక్టు కార్మికులు కేంద్రంగా సంఘం బలోపేతం అవసరం అని నొక్కి చెప్పారు.

అనేక ప్రాంతాల్లో కనీస వేతనాలు, పర్మినెంట్‌ వంటి అంశాల్లో విజయం సాధించామనీ, ఈ కృషిని మరింత కొనసాగించాలని సూచించారు. సంఘ నిర్మాణానికి, రాజకీయ మార్పులే లక్ష్యంగా విస్తరించాలన్నారు. వలస కార్మికుల కేంద్రంగా సీఐటీయూ పని జరగాలనీ, ఆయా రంగాలలో ఇప్పటికే ఉన్న సంఘాలు వలస కార్మికులపై కేంద్రీకరించి పని చేయాలని పిలుపునిచ్చారు. సభ్యత్వం పెంచడమే సంఘ విస్తరణకు మార్గమన్నారు. కార్మికులలో సంఘం పట్ల విశ్వాసాన్ని పెంచగలిగితే ఉద్యమాలకు కదిలేందుకు సిద్ధంగా ఉంటారని చెప్పారు. లేబర్‌ కోడ్‌లు నోటిఫై చేసిన తర్వాత కార్మికులపై కొత్తరకం దాడులు మొదలయ్యాయనీ, దానికి వ్యతిరేకంగా రాష్ట్ర స్థాయిలో ఉద్యమాలను కొనసాగించాలని సూచించారు. దేశంలో మతో న్నాద, విభజన రాజకీయాలను తిప్పికొట్టేందుకు కృషి పెరగాలన్నారు. కార్మికుల మెదళ్లలోకి మతోన్మాద వైరస్‌ను ఎక్కించేందుకు జరుగుతున్న కుట్రలను తిప్పికొట్టాలనీ, పాలక వర్గాల కార్పొరేట్‌ మతోన్మాద బంధానికి వ్యతిరేకంగా కార్మికులను సమాయత్తం చేయాలని పిలుపునిచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -