తెలుగు విభాగంలో జి ప్రసాద్ కు డాక్టరేట్ ప్రధానం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ లోని తెలుగు విభాగంలో పరిశోధక విద్యార్థి జి ప్రసాద్ కు సీనియర్ ప్రొఫెసర్ అయాచితం వెంకటేశ్వర శర్మ  పర్యవేక్షణలో ” నిజామాబాద్ జిల్లా పరమాధిక్ సాహిత్యం- సమగ్ర పరిశీలన ” అనే అంశంపై పరిశోధన జరిపారు. మంగళవారం జరిగిన బహిరంగ మౌఖిక పరీక్షకు ఎక్స్టర్నల్ ఎగ్జామినల్ గా ప్రొఫెసర్ శంకర్ రావు  చెన్నై యూనివర్సిటీ  హాజరై పరిశోధన సిద్ధాంత గ్రంథం పై విస్తృతమైన ప్రశ్నలు లేవనెత్తరు. పరిశోధకురాలు అన్ని ప్రశ్నలకు ప్రయోగాత్మకమైన ఉదాహరణలతో సమాధానాలు ఇచ్చారు. ఈ పరిశోధన సమాజంలోని నిద్రాంశమైనా మానవీయ విలువలను శాంతిని ప్రధానంగా పార్థమాదిక సాహిత్యం అందిస్తుందని, సమాజ కళ్యాణనికై ఈ సాహిత్యం పాటుపడుతుందని‌ అయన  తెలిపారు.జి.ప్రసాద్ అందించిన జవాబులకు  బహిరంగ మౌఖిక పరీక్షకు హాజరైన ప్రొఫెసర్లు సంతృప్తి వ్యక్తం చేసి పీహెచ్డీ  డిగ్రీకి ఆమోదం తెలిపారు.ఈ బహిరంగ మౌఖిక పరీక్షకు తెలుగు విభాగ అధిపతి ప్రొఫెసర్ కే లావణ్య,కంట్రోల్ ఆఫ్ ఎగ్జామ్ డాక్టర్ ఎం అరుణ, ప్రొఫెసర్ డాక్టర్ కనకయ్య, డాక్టర్ లక్ష్మణ్ చక్రవర్తి, ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ చెందిన రమణాచారి, ఎంసీఏ కి చెందిన బ్రమరాంబిక, పరిశోధక విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పరిశోధక విద్యార్థి జి ప్రసాద్ మాట్లాడుతూ మా పర్యవేక్షకులు సీనియర్ ప్రొఫెసర్ అయాన్చితం వెంకటేశ్వర శర్మ ఎంతో వెయ్యి  ప్రయాసలకు ఓర్చుకొని వైవా కు వచ్చారని పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా పరమార్థక అంశాలను వివరిస్తూ ఆశీర్వదించడం వారి సమక్షంలో పి హెచ్ డి  పట్టాను పొందడం నా అదృష్టంగా భావిస్తున్నానని జి ప్రసాద్ ఈ వైవా కు వచ్చిన వారందరికీ నన్ను సహకరించిన వారందరికీ ధన్యవాదములు వివరించారు.
Spread the love