మీ గొంతుకనై సేవ చేస్తా: గాలి అనిల్ కుమార్

– త్వరలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుంది జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్ కుమార్
నవతెలంగాణ – పెద్దకొడప్ గల్
మండల కేంద్రంలో సోమవారం ఏర్పాటు చేసిన రోడ్డు షోలో భారస ఎంపీ అభ్యర్థి అనీల్ కుమార్ మాట్లాడుతూ..మరి మే 13 నాడు పార్లమెంట్ ఎలక్షన్ జరగబోతున్నాయి కారు గుర్తు మీద ఓటు వేసి నన్ను భారీ మెజార్టీగా గెలిపించి పార్లమెంటు పంపిస్తే మరి నేను  మీ గొంతుకనై మీ సేవకుని మీ కుటుంబ సభ్యునిగా పార్లమెంట్లో మీ గొంతు వినిపిస్తాననీ అన్నారు. ఈ రెండు జాతీయ పార్టీల వాళ్ళు ఎవ్వరూ కూడా మన తెలంగాణ గురించి మాట్లాడరు  మీరు బాగా ఆలోచించండి మన తెలంగాణ ఎట్లా వచ్చింది ఎంతమంది ఎంపీలు గెలిచము, ఇప్పుడు కూడా అత్యధిక  ఎంపీ సీట్లు గెలిస్తే అతి త్వరలోనే మన ప్రభుత్వం కూడా ఏర్పడుతుంది, మళ్ళీ కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. ఎందుకంటే మీరందరూ కూడా ఈప్రభుత్వన్ని చూస్తున్నారు.ఈ  కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి దొంగ మాటలు చెప్పి దొంగ హామీలు ఇచ్చింది. మన కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లుండే ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకం వచ్చింది.వచ్చిందా లేదా?ఈ అసమర్ధత ప్రభుత్వం వల్ల  మల్ల మనం పది సంవత్సరాలు  అభివృద్ధిలో వెనక్కి పోయినట్టే.  అవునా కాదా?  కరెంట్ వస్తలే  నీల్లో స్తలే ఏది లేదు రైతు బందు లేదు రైతు రుణమాఫీ లేదు ఒక్కసారి బాగా ఆలోచించి మళ్లీ కారు గుర్తు మీద ఓటు వేసి గెలిపిస్తే మరి మన ప్రాంత ప్రజలకు నేను సేవ చేసుకునే భాగ్యం నాకు కల్పిస్తారు అని  నేను కోరుకుంటున్న.
ఎందుకంటే యువత చాలామంది ఉన్నారు నిరుద్యోగులు ఉన్నారు వీళ్ళందరికీ ఉపాధి కావాలంటే మన ప్రాంతంలోనీ యువతకు ఉద్యోగాలు వచ్చే విధంగా నేను పోరాడి మీ అందరికీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ పెట్టి మీ అందరికీ జాబ్స్ ఏర్పాటు చేసే విధంగా నేను చూస్తాను. నన్ను ఆశీర్వదించి పార్లమెంటు పంపిస్తే మీ సేవ చేసే అవకాశం ఇవ్వండి. కెసిఆర్ గారి 10 ఏళ్లలో అభివృద్ధి అంటే ఎంటో చేసి చూపించిండు  కరెంటు ట్రాన్స్ఫర్లు ఇవన్నీ మనకు ఎంతో డెవలప్మెంట్ చేసిండు. అందుకనే మీరు ఒక్కసారి బాగా ఆలోచించి కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే మరి నేనేందో మీకు చూపిస్తా..! ఎందుకంటే గతంలో ఉన్న బిజెపి అభ్యర్థి మీకేం చేయలే కాంగ్రెస్ అభ్యర్థి ఏం చేయలే వాళ్ళిద్దర్నీ కూడా చూశారు. కాబట్టి నాకు ఒక అవకాశం ఇస్తే మీ సేవలో ఉంటాను . అందరికి ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో  బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హనుమంత్ సిండే,మాజీ జడ్పీ చైర్మన్ ద ఫెదర్ రాజ్, ఎంపీపీ ప్రతాప్ రెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు విజయ్ దేశాయ్, సతీష్ యాదవ్, టిఆర్ఎస్ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
Spread the love