గణేష్ ఉత్సవాలను ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా నిర్వహించుకోవాలి

– పట్టణ సీఐ నరహరి
నవతెలం- గాణ కంఠేశ్వర్
గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని నగర సీఐ నరహరి నిజామాబాద్ పట్టణ ప్రజలకు  సూచించారు.వినాయక మండపాల నిర్వాహకులు బాధ్యతాయుతంగా, తప్పనిసరిగా పోలీస్ శాఖ అనుమతి పొందాలి. మండపాల వద్ద అసాంఘిక కార్యకలాపాలు చేపట్టే వారి పై కఠిన చర్యలు,సీ నిజామాబాద్ పట్టణ వినాయక మండప నిర్వహకులకు ఇప్పటికే అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.వినాయక చవితి  నవ రాత్రులు, శోభయాత్ర ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని తెలిపారు. నాలుగో పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఆదివారం నిర్వహించిన పాత్రికేయులు సమావేశంలో సూచనలు పలు చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాబోయే వినాయక చవితి వేడుకలను హిందూ మిత్రులు ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని , వినాయక మండపాల నిర్వాహకులు కచ్చితంగా పోలీస్ శాఖ అనుమతి పొందాలన్నారు.గణేష్ విగ్రహాన్ని ప్రతిష్టించే ప్రతి గణేష్ మండలి వారు విధిగా పోలీస్ శాఖ నుండి ముందుగా ఆన్ లైన్ లో లింక్ https://policeportal.tspolice.gov.in/index.htm ద్వారా దరఖాస్తు చేసి అనుమతి తీసుకోవలెను. అనుమతి కొరకు దరఖాస్తు చేయునపుడు, విగ్రహం ఎత్తు, విగ్రహాన్ని ప్రతిష్టించే తేది, నిమజ్జనం తేది మరియు మండలి యొక్క ప్రెసిడెంట్, వైస్ ప్రసిడెంట్ ల వివరాలు సమర్పించ వలెను.గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ప్రశాంతయుత వాతావరణంలో నిర్వహించుకోవాలి.గణేష్ విగ్రహాలను ప్రధాన రహదారులు, ప్రజలు తిరిగే రోడ్లపై  కాలిబాటల పైన ప్రతిష్టించరాదు. వాహనదారులకు, ప్రజలకు, ట్రాఫిక్ కు ఎలాంటి అడ్డంకులు కలిగించవద్దు.గణేష్ మండపాలలో తొమ్మిది రోజుల పాటు విద్యుత్ సరఫరా కోసం సంబంధిత విద్యుత్ శాఖ ద్వారా అవసరమైన అనుమతులు తీసుకోవాలి. విద్యుత్ అధికారుల సూచనలు పాటిస్తూ అవసరమైన అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.గణేష్ మండపాల వద్ద పూజా కార్యక్రమాలలో పాల్గొనే భక్తుల వాహనాలను పార్కింగ్ కొరకు తగినంత దూరంలో, నిర్దేశించిన ప్రదేశాలలో ఉంచే విధంగా అవసరమైన ఏర్పాట్లు చేయాలి. మండపాల వద్ద తగిన సంఖ్యలో అవసరమైన వరకు స్థానిక, సత్ప్రవర్తన కలిగిన వాలంటీర్లను నియమించి వారు భక్తులను క్రమబద్ధీకరించే విధముగా చూసుకోవాలి. గణేష్ మండపం దగ్గర మత్తు పదార్థములు సేవించడం, జూదం ఆడటం, ఇతర అసాంఘిక కార్యక్రములు చేయకూడదు. అలా ఎవరైనా చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.
    గణేష్ మండపాలను జాగ్రత్తగా చూసుకొనుటకు రాత్రి సమయంలో కనీసం ఇద్దరు లేదా ముగ్గురు సత్ప్రవర్తన కలిగిన వాలంటీర్లు ఉండే విధంగా చూసుకోవాలి. సమస్యాత్మక ప్రాంతాల్లో విగ్రహ ప్రతిష్ట, మండపము వద్ద జరుగే కార్యక్రమములు పోలీసు వారు తెలిపిన నిబందనలకు లోబడి ఉండునట్లు చూసుకోవాలి.గణేష్ మండపాల వద్ద జరుగు కార్యక్రమములు ఎట్టి పరిస్థితుల్లో రోడ్డుపై వెళ్లే ప్రజలు, వాహన దారులకు అసౌకర్యము కలిగించకుండా చూసుకోవాలి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్లను తక్కువ సౌండ్ తో రాత్రి 10-00 గంటల వరకు మాత్రమే వినియోగించాలి. ముఖ్యంగా భారీ శబ్దంతో ఉండే లౌడ్ స్పీకర్లు, డి.జె. సౌండ్ సిస్టమ్స్ వినియోగించరాదు. అదే విధంగా పాఠశాల, కళాశాల, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, ప్రభుత్వ మరియు ప్రైవేటు కార్యాలయాలకు, ప్రార్థనా మందిరాలకు ఇబ్బంది కలిగే విధంగా ఉండరాదు.
   రాత్రి సమయంలో తనిఖీ చేయడానికి, పెట్రోలింగ్ కు వచ్చే పోలీస్ అధికారులతో మండపాల వద్ద ఉండే వాలంటీర్లు అడిగిన సమాచారం ఇవ్వడంతో పాటు పోలీసులతో సహకరించాలి. ఎలాంటి ఇబ్బంది ఏర్పడినా, ఏదైనా విషయం, సమాచారం ఉన్నా డయల్ 100 ద్వారా లేదా సంబందిత పోలీస్ స్టేషన్లలో సమాచారం ఇవ్వాలి.చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా, నిబంధనలు అతిక్రమించినా సంబంధిత వ్యక్తులపై చట్ట పరమైన చర్యలు తీసుకోబడును.ఈ కార్యక్రమంలో నాలుగో పట్టణ ఎస్సై సంజీవ, మూడవ పట్టణ ఎస్సై ప్రవీణ్, రెండవ పట్టణ ఎస్సై అశోక్  సిబ్బంది పాల్గొన్నారు.
Spread the love