నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
జాతీయ రహదారిలో దోపిడీలకు పాల్పడు తున్న పార్ధి గ్యాంగ్‌కు సంబంధించి ఇద్దరు సభ్యులను అరెస్టు చేయగా, మరో ముగ్గురి కోసం గాలిస్తున్నా మని ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. శుక్రవారం తెల్లవారు జామున పెద్ద అంబర్‌పేట వద్ద పోలీసులు గాలిలోకి కాల్పులు జరిపి పట్టుకున్న విషయం విదితమే. శనివారం అరెస్ట్ చేయడంతో నిందితుల నుంచి ఒక స్క్రూ డ్రైవర్, రెండు కత్తెరలు, రూ .17 వేల నగదు, ఒక జత వెండి పట్టీలు, ఒక టార్చ్ లైట్ స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. నల్గొండ జిల్లా, హైదరాబాద్ నగర పరిధి సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ పరిధిలో దోపిడీలకు పాల్పడుతు న్నారన్నారు. కట్టంగూర్ పీఎస్ పరి ధిలో డబ్బుల కోసం ఓ లారీ డ్రైవర్ ను హత్యచేశారని చెప్పారు. తెలంగాణ వ్యాప్తంగా వీరిపై 32 కేసులు ఉన్నాయని తెలిపారు. ఈ గ్యాంగ్ మహారాష్ట్రకు చెందిన ముఠా అని చెప్పారు. వీరు ఎక్కడా విశ్రాంతి తీసుకోకుండా నిరంతరం దోపిడీలపై ఫోకస్ పెడతారన్నారు. దొంగలించిన అభరణాలను మహారాష్ట్ర లో విక్రయిస్తుంటారని చెప్పారు. ఈ కేసులను చేధించుటలో ప్రతిభ కనిపించిన డిఎస్పి కె.శివరాం రెడ్డి, నల్గొండ సిఐ నాగరాజు, నార్కెట్ పల్లి, ఎస్సై సైదాబాబు, చిట్యాల సిబ్బంధి విష్ణువర్ధన గిరి, సిసిఎస్ నల్గొండ, మోహసీన్ పాషా, హెచ్ సి చిట్యాల, ఏఆర్పిసి లు పి. విక్రమ్ శంకర్, అర్. సాయిరామ్, ఎండి. కలీమ్, ఎస్. సాయికుమార్ లను ఎస్పీ అభినందించారు.