1989లో మొదటిసారి హైదరాబాద్‌లో అడుగు పెట్టాను. సెంట్రల్ యూనివర్సిటీలో సీట్ సంపాదించి భయంభయంగా వచ్చాను. బెజవాడలో డిగ్రీ చేసి హైద రాబాద్ మాస్టర్స్‌కి. చిన్న పిల్లాణ్ణేం కాదు గానీ, బెజ వాడలో ఎన్నాళ్లున్నా నాకు తెలియని ప్రపంచం చూపిం చిన ఊరు కాదది. హోటల్‌కి వేళ్తే మనకి తెలిసిన పెస రట్లూ, ఇడ్లీలూ, పుణుగులూ, బజ్జీలూ. తెలుగు తప్పా ఇంకోటి మాట్లాడే అవసరం లేదు. పల్లెటూరి నించి వచ్చి నవాడికి విజయవాడ పెద్ద నగరమే. కానీ అది మంచి ఏ.సీ సినిమా హాళ్ళకీ, సిటీబస్సులకీ పరిమితం. రోటీ కర్రీలూ, పానీ పూరీలూ, బిర్యానీలూ తెలీవు. పనీర్ అనే ఒక పదార్థం ఉందని కూడా తెలీదు, సత్య ప్రమాణకంగా!
హైదరాబాద్‌లో మొదటివారమే అనుకుంటా, మెహిదీపట్నంలో యూనివర్సిటీ బస్‌కి టైం ఉందని బస్ స్టాప్‌లో ఉన్న ఇరానీ రెస్టారెంట్ కి వెళ్ళా. పేరు గుర్తు లేదు, తర్వాత కాలంలో చెప్పలేనన్ని గంటలు గడిపిన చోటు అది. కానీ అప్పటికి ఇరానీ రెస్టారెంట్ కాన్సెప్ట్ కూడా తెలీదు. నలుగురు కూర్చునే టేబుల్ మీద ఓ మూలకి కూర్చుని ఆర్డర్ చెయ్యడం కోసం చూస్తున్నా. ఓ ముగ్గురు అప్పుడే లోపలికి వచ్చి ఇంకెక్కడా చోటు లేక వచ్చి నేనున్న టేబుల్ మీద కూర్చు న్నారు. నేను కూర్చున్న టేబుల్ మీద నన్నడక్కుండా కూర్చోడమే చిరాకు తెప్పించే వ్యవహారం. ఏమన్నా అంటానికి భయం. వాళ్లు మాట్లాడే హైదరాబాదీ అప్పటికీి అర్థ మయ్యే అవకాశమే లేదు. బిక్కచచ్చి చూస్తున్నా.
ఈ లోపు ‘చోటూ’ వచ్చాడు టీ ఆర్డర్ తీసుకోడా నికి. నాకు ఒక టీ అని చెప్పా. వాళ్ళు ‘నీ ఒక్కనికి చెప్తవా తమ్మీ’ అని ‘దో చారు దో ఎంప్టీ’ గా ఆర్డర్ మార్చేశారు. అసలు అందులో నా అభిప్రాయానికి ఓ అవకాశం కూడా లేదు. అందునా నా ఒక్కడికీ టీ చెప్పుకుని ఓ పరమ నీచకార్యానికి తలపడ్డానాయే, నాకు సంస్కారం నేర్పకుండా ఉండే అవకాశం లేదు. ఎవరో తెలీదు, నా పక్కన ఎందుకు కూర్చున్నారో తెలీదు, వాళ్ళతో కలిసి ఎందుకు ఆర్డర్ చెయ్యలో తెలీదు. భయంభయంగా వచ్చిన టీ తాగేశాక, బిల్ ఎలా కట్టాలో తెలీదు. బస్ ఒచ్చే టైం అవడంతో లేచి డబ్బులు తీసి ‘ఎంతండీ’ అనడిగా. ‘ఒక్కనికిస్తావురా బరు’ అన్నాడు నా వంక వింతగా చూస్తూ. వీళ్ళందరికీ నాతో పెట్టించే కుట్రా ఇదీ అనుకుంటూ, ఇంకా డబ్బులు తియడానికి జేబులో చెయ్యి పెట్టా. ‘ఎల్లు తమ్మీ, నీ ఒక్కని చారుకి మేం ఇయ్యగల్తం’ అని నా సమాధానం కోసం కూడా చూడ కుండా వాళ్ళ మాటల్లోకి దిగిపోయారు.
వాళ్ళకి తెలియనిదేంటంటే, నాకు అది మొదటి పాఠం, హైదరాబాద్ ఆత్మని పట్టిచ్చే పాఠం. వాళ్ళు హిం దువులో, ముస్లిములో నాకు తెలీదు. నేనెవర్నో వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. కానీ నాతో మాట్లాడినప్పుడు మార్చిన భాష, నా బిల్లు కట్టిన తీరు, వాళ్ళకి కచ్చితంగా నా గురించిన అవగాహన వచ్చేసింది.
ఓ సంవత్సరమో ఎంతో గడిచిపోయింది. కాస్త అలవాటుపడిపోయా. ఓసారి ఇల్లందునించి హైదరాబా దుకి, ఖమ్మంలో ఏదో రైలు ఎక్కి వచ్చా. ఎనిమిందిటికి రావాల్సిన రైలు చాలా ఆలస్యమయింది. సికింద్రాబాదు లో అయిదో నంబర్ ఎక్కి మెహిదీపట్నం చేరేసరికి పదో, పదకొండో దాటింది. యూనివర్సిటీ ఆఖరి బస్ తొమ్మి దిన్నరకి. బి.హెచ్.ఇ.ఎల్ వెళ్ళే ఆర్.టి.సి బస్ కూడా పదింటికనుకుంటా ఆఖరిది. మెహిదీపట్నం నించి హెచ్.సి.యుకి వెళ్ళే అవకాశం లేదు. ఏడుపొక్కటే తక్కువ. నడుచుకుంటూ ఫ్రెండ్‌కి ఫోన్ చేద్దామని ఇరా నీ రెస్టారంట్ దగ్గరికి వెళ్టే షటర్ క్లోజ్ చేస్తున్నా డొకా యన. వెళ్ళి బతిమాలా, ఒక్క ఫోన్ చేసుకోనీండీ, యూనివర్సిటీ కెళ్ళలేను, మసాబ్ టాంక్‌లో ఉన్న ఫ్రెండ్ వాళ్ళింట్లో పడుకుంటా అని.
హైదరాబాద్‌లో మెలో డ్రామా ఉండదు (అది బెజ వాడ సొంతం). నాకు పేరు తెలీని ఇంకో డ్రామా ఉం టుంది. ఆ మనిషి సరే అని గాని, కాదని గానీ అనలా. విన్నట్టు కూడా రెస్పాన్స్ లేదు. నిశ్శబ్దంగా షట్టర్ మూ సేసి. ఓ చేతక్ స్కూటర్ దగ్గరికి నడిచి, దాన్ని స్టార్ట్ చేసి ఒక్కటే మాటన్నాడు. ‘పీఛే భైటో’. సింపుల్!
స్కూటర్ వెళ్తున్నప్పుడడిగాడు. ‘ఫ్రెండ్ ఇంట్లో ఉం టాడని నమ్మకమేమిటీ’ అని.ఫ్రెండ్ ఇంటిదాకా వచ్చి, మా వాడు తలుపు తీశాక, వాడికి నన్ను అప్ప జెప్పి అప్పుడు ఆ మనిషి తన దారిన తాను పోయాడు. ఆ మనిషి ఎవరో, ఆ హోటల్ ఓనరో, పనోడో, హిందూవో, ముస్లిమో తెలీదు. నేనెవరూ అని తను అడగలా. మా ఫ్రెండ్ తలుపు తీయకపోతే ఆ మనిషి నా పూర్తి బాధ్యత తీసుకునే వాడు అని నాకు కచ్చితంగా తెలుసు.
నేను చాలా దేశాలు తిరిగాను, చాలా మంది సహా యాలు పొందాను. అన్నీ నాకు గుర్తున్నాయి. కానీ హైద రాబాద్‌లో ఉండే ఆ కాజుయల్, అతి సహజమయిన సహజీవనం ఇంకోచోట నాకు తెలీదు. మొన్నోసారి భావనాని (మా అమ్మాయి) ఓల్డ్ సిటీకి తీసుకెళ్తే ‘ఈ చిన్న రెస్టారెంట్లు భలే ఉన్నాయి, కరోనా లేకపోతే వె ళ్లుండే వాళ్ళం’ అంది. దానికి నేను చెప్పింది ఒకటే, ‘నీ వల్ల కాదు ఈ వాతావరణంలో ఇమడడం. ‘నా స్పేస్ ‘, ‘ప్రైవసీ’, ‘నేను’ లాంటివి వదల గలిగినప్పుడే ఇక్కడ కారు దిగు అని.’
ఈ నగరంలోనే మత కలహాలూ కూడా జరిగాయి ఆ రోజుల్లో. బాబ్రీ తర్వాత అన్నీ మూసేస్తే సవాలక్ష కష్టాలు పడి ఇళ్ళకు చేరాం. కానీ చిత్రమేమిటంటే, అందరం ఒకటే నమ్మేవాళ్ళం. మతకలహాలన్నీ రాజకీయ హత్యలేనని. ముఖ్యమంత్రి మారాల్సొచ్చినప్పుడల్లా హత్యలు జరిగేవి అని అందరికీ తెలిసిన సంగతే. ఎన్ని సో కాల్డ్ మత కలహాలు జరిగినా సామాన్య జనాల మధ్య నమ్మకాలు పోలేదు అని నేను చెప్తే నమ్మడానికి నువ్వు హైదరబాదీ అవ్వల్సిందే! ఉదాహరణకి, అహ్మ దాబాదోళ్ళు ఎన్ని జన్మలెత్తినా ఈ సంగతి అర్థం చెసుకో లేని నష్టజాతకులు. ఇప్పుడు ఈ హైదరాబాద్ మీద సర్జి కల్ స్ట్రైక్ చేస్తారట. ఎవర్రా మీరు? మీరు ఉద్ధరిం చాలనుకున్న మతమే మీకు అర్థం కాలేదు. హైదరాబాద్ మీకు ఎప్పటికీ అర్థం కాదు.
నిజం చెప్పొద్దూ, ఇంతకు ముందు ఉన్న నమ్మకం ఇప్పుడు పోతోంది. హింస గెలుస్తోంది. కల్మషం గెలు స్తోంది. విషం ఉత్తరాది నించి కిందకి దిగుతోంది. హైద రాబాద్ డిఎన్‌ఎలో ఉన్న సహజమైన ప్రేమ దీన్ని తట్టు కుని నిలబడగలదా? చూడాలి. నాకు మూడు ప్రాం తాల మీద నమ్మకం, హైదరాబాద్‌లోని ప్రేమ, చెన్నరులోని మేధ, కేరళలోని సైద్ధాంతిక నిబద్ధత. ఈ దేశానికి మిగిలిన ఆఖరి మూడు ఆశలు అవి.
ఉత్తరాదినించి వచ్చిన ఈ దండయాత్రని ఈ మూడూ ఆపగలవా?
– అక్కిరాజు భట్టిప్రోలు (ఫేస్‌బుక్ నుంచి)