ఇచ్చిన మాటకు కట్టుబడిన కాంగ్రెస్: ముప్ప గంగారెడ్డి

Congress is committed to its word: Muppa Gangareddyనవతెలంగాణ – మోపాల్ 

రాష్ట్రంలోని రైతు ప్రభుత్వం కర్షకుల ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ  అని రైతులకు అధిక ప్రాముఖ్యత నిస్తుంధనీ అందులో భాగంగా ఏక కాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిందని కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు ముప్పగంగారెడ్డి తెలిపారు. ఆదివారం రోజు మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన పంట రుణమాఫీ చారిత్రక నిర్ణయమని, దేశంలోని మిగతా రాష్ట్రాలకు మన తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తుందని ఆయన తెలుపుతూ అలాగే రైతులకు లబ్ధి చేకూరే పథకంపై ప్రతిపక్ష నేతలు తప్పుగా మాట్లాడవద్దని అర్హత ఉన్న ప్రతి రైతుకు పంట రుణ మాఫీ చేస్తామన్నారు నెల రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  చర్యలను వేగవంతం చేసినట్లు . ప్రస్తుతం  లక్ష రూపాయల రుణ మాఫీ చేశారని  త్వరలో రూ.1,50,000, రెండు లక్షల రుణమాఫీ చేసి  తీరుతుందని రైతులు ఏటువంటి ఆందోళన చెందవద్దని, మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి  విద్య, వ్యవసాయం ప్రాముఖ్యత తెలిసిన వ్యక్తి అని అనేక విప్లవాత్మక మార్పులు చేపట్టే విధంగా ఆయన కార్యచరణ ఉంటుందని. అలాగే కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే  తప్పదని, మేనిఫెస్టో ప్రకారం ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చుతుందని ఆయన తెలిపారు. అలాగే ముఖ్యంగా విద్యారంగంలో కూడా అనేక మార్పులు చేపడుతున్నారని త్వరలో అంగన్వాడి స్కూల్స్ ని తీర్చిదిద్ది కార్పొరేట్ ప్లే స్కూల్ లకు దీటుగా వాటిని తయారు చేసి నాణ్యమైన విద్యను గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చిన్నపిల్లలకు అందిస్తరని ఆయన తెలిపారు.
Spread the love