
– అదనపు కలెక్టర్ రెవెన్యూ బి.ఎల్. లత
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జిల్లాలో గ్యాస్ ఉన్న ప్రతి ఒక్కరు ఈ కేవైసీ అప్ డేట్ తప్పక చేయించుకోవాలని అదనపు కలెక్టర్ బి.ఎస్. లత సూచించారు.శనివారం కలెక్టరేట్ లోని గ్యాస్ డీలర్స్, సంబంధిత శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ వ్యాపారస్తులు కమర్షియల్ సిలెండర్ మాత్రమే వాడాలని సూచించారు.గ్యాస్ అందించుటలో వినియోగదారులకు మెరుగైన సేవాలందించాలని, గ్యాస్ బాయ్స్ తో ఇబ్బందులు ఎక్కడకుండా రాకుండా డీలర్లు, సంబంధిత అధికారులు చూడాలని అన్నారు. ఒక సంవత్సరానికి వినియోగదారులు 12 వరకు వినియోగించుకోవచ్చని అలాగే హోటల్స్ ,వ్యాపారస్తులు రెసిడెన్సిల్ సిలెండర్ వాడితే చర్యలు తీసుకుంటామని సూచించారు.ఈ కార్యక్రమంలో డి.ఎస్.ఓ మోహన్ బాబు, అసోషియేషన్ అధ్యక్షురాలు కొటేశ్వరి, వివిధ కంపెనీల గ్యాస్ డీలర్లు తదితరులు పాల్గొన్నారు.