నవతెలంగాణ – కామారెడ్డి
కేంద్ర ప్రభుత్వము పెంచిన వంట గ్యాస్ ధరలను, పెట్రోల్ డీజిల్ పై పెంచిన రెండు రూపాయల ఛార్జీలను వెంటనే తగ్గించాలని భారత మాక్సిస్టు కమ్యూనిస్టు పార్టీ ( (ఐక్య) ఎంసిపిఐయు) కార్యదర్శి జబ్బర్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. కేంద్రములోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రజలకు మేము అధికారంలోకి వస్తే గ్యాస్ ధరలు పెంచము నిత్యవసర వస్తువుల ధరలు తగ్గిస్తాము అని వాగ్దానము చేశారని, కరెంటు చార్జీలు పెంచము అని, ఈనాడు కరెంటు చార్జీలు పెంచి స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారని ఇచ్చిన వాగ్దానాలను తప్పినారని అన్నారు. అంతే కాకుండా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ముస్లిం, మైనార్టీలకు ద్రోహం చేస్తూ వర్క బోర్డు బిల్ ను సవరణ చేసి ముస్లిం ప్రజానీకానికి ద్రోహం చేసిందని దానికి రాష్ట్రంలో ప్రభుత్వం బిల్లు పాస్ కావడానికి మద్దతు పలికిందని ఇది ద్రోహం చేయడమేనని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే గ్యాస్ పై పెంచిన 50 రూపాయలను తగ్గించాలని, కరెంటు చార్జీలను తగ్గించాలని, డీజిల్ పెట్రోల్ పై పెంచిన రెండు రూపాయల ఛార్జీలను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొన్నారు.