గీత కార్మికుడికి తీవ్ర గాయాలు

– తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేయాలని బిక్కీ బుచ్చయ్య గౌడ్ డిమాండ్
నవతెలంగాణ – నూతనకల్
గీతా కార్మికుడికి తీవ్ర గాయాలైన సంఘటన మండల పరిధిలోని మిరియాల లో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం అదే గ్రామానికి చెందిన బింగి లింగయ్య వృత్తిరీత్యా గీతా కార్మికుడు. దినసరి చర్యలో భాగంగా తాడు చెట్టు ఎక్కుతూ ప్రమాదవశాత్తు జారీ కింద పడడంతో తీవ్ర గాయాలు పాలయ్యాడనీ తెలిపారు. చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ లో చేర్చామని బాధితుడి వెన్నుముక వీరిగి పరిస్థితి విషమించడంతో మరో ప్రవేట్ చికిత్స పొందుతున్నాడని తెలిపారు. తీవ్ర గాయాల పాలైన వెన్నుముక విరిగి శాశ్వతంగా వికలాంగుడు అయ్యే అవకాశం ఉన్న బాధిత లింగయ్య కు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయాన్ని వెంటనే అందజేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉప అధ్యక్షుడు బిక్కి బుచ్చయ్య గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Spread the love