యాదగిరిగుట్ట మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశము

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదగిరిగుట్ట మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశము శనివారం, ఎంపీపీ చీర శ్రీశైలం అధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎండాకాలం గ్రామాలలో ప్రజలకు తాగునీటి సమస్య రాకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. వరి కోతలు దగ్గర పడుతున్న సమయంలో వడ్లు కొనుగోలు కేంద్రాలు సకాలంలో ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. గ్రామాలలో లోవోల్టేజ్ సమస్య రాకుండా చూసుకోవాలని విద్యుత్ అధికారులకు సూచించారు. విద్యుత్ అధికారులు వరి కోతలు పూర్తి అయ్యేంతవరకు విద్యుత్ అంతరాయం కలగకుండా అందజేయాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి అన్నారు. వేసవిలో వైద్యాధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి తగు జాగ్రత్తలు, సూచనలు, వైద్యం అందించాలని సూచించారు. పదో తరగతి పరీక్షలు జరుగుతున్నందున విద్యార్థులకు ప్రత్యేక క్లాసులు తీసుకొని, మండలంను రాష్ట్రస్థాయిలో పేరు ప్రతిష్టలు తెచ్చే విధంగా ఉత్తీర్ణత శాతం ఉండాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో  జడ్పిటిసి తోటకూరి అనురాధ బీరయ్య, ఎంపీడీవో కోట నవీన్ కుమార్, ఎంపిటిసిలు ఎడ్ల సుగుణమ్మ రామిరెడ్డి, కోక్కలకొండ అరుణ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love