సంచలనం సృష్టిస్తున్న టాలివుడ్ డ్రగ్స్ కేసులో రోజురోజుకూ అనేక విషయాలు బయటకు వస్తు న్నాయి. క్రూయిజ్‌డ్రగ్స్ కేసులో మరో ఏడుగురు నింది తులను అరెస్టు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఇందులో అనేక సినీ నటులకు సంబంధం ఉందన్న నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది. అసలు డ్రగ్స్ మాఫియాతో సినీ ఇండిస్టీకి సంబంధం ఏంటి? సడెన్‌గా సీన్‌లోకి ఈడీ ఎంట్రీ ఎందుకైంది. ఈడీకి పూర్తి ఆధారాలు ఎక్సై జ్‌శాఖ ఇవ్వకపోవడంలో అంతర్మథనం ఏంటనే అను మానం తలెత్తుతోంది. 2017 టాలివుడ్‌ను కుదిపే స్తున్న డ్రగ్స్‌కేసులో సినీ ప్రముఖలు ఉన్నారనేది పత్రి కలు, టీవీ చానళ్లు, సోషల్ మిడియాల్లో కథనాలు వ స్తూనే ఉన్నాయి. అయినా డ్రగ్స్ మాఫియాను అరిక ట్టడంలో నిందితులను శిక్షించడంలోనూ గత ప్రభుత్వా లు విఫలమయ్యాయి. అయితే కొత్తగా వచ్చిన కాం గ్రెస్ ప్రభుత్వం టాలివుడ్ డ్రగ్స్‌పై దృష్టి సారించాల్సిన అవసరమున్నది. ఇన్నిరోజులు డగ్స్ కేసును ఈడీ విచా రణలతోనే సరిపెట్టారే తప్ప ముగింపు పలకలేదు. ఇందులో రాజకీయ పార్టీల నాయకులు, బడా వ్యాపార వేత్తలు, సినీ ఇండిస్టీ పెద్దల హస్తం ఉండడంతో ఎటూ తేల్చలేకపోయారు. ఈ క్రమంలో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ..డ్రగ్స్ అనే మాట రాష్ట్రంలో ఉండొద్దని, ఆ మాట వింటేనే భయం పుట్టేలా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
గాబ్రియేల్ నుంచే పెద్ద ఎత్తున హైదరాబాద్‌లోకి డ్రగ్స్ ప్రవేశించినట్లుగా పోలీసులు తేల్చారు. ఇటీవల మాధాపూర్ ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లో సినీ నిర్మా తలు డ్రగ్ పార్టీ చేసుకుంటూ పట్టుబడిన ఘటన మరు వకముందే మరో వ్యవహారం కూడా వెలుగు చూ సింది. ఈ ఏడాది జూన్ 19న పృధ్వీకృష్ణ రాహుల్ తెలోర్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 70 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. కూపీ లాగితే టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసులో లింకులు కదులుతున్నాయి. మాదాపూర్‌లో పట్టుబడిన మత్తు పదార్ధాల కేసులో టాలీవుడ్ యాక్టర్‌కు ఈడీ లేటెస్ట్‌గా నోటీస్ జారీ చేసి న విషయం విధితమే. ఇప్పుడు ఈడీ ఎంట్రీతో మాదాపూర్ డ్రగ్స్ కేసులో ఇంకెన్ని సంచనాలు తెరపైకి వస్తాయోననే చర్చ జరుగుతోంది. కాగా మాదక ద్రవ్యాల నిరోధక విభాగం వారి నుంచి డ్రగ్స్ మూలా లపై ఆరా తీశారు. ఇప్పటి వరకు పోలీసులు కొకైన్ ఎల్‌ఎస్‌డీ, ఇతర మత్తు పదార్థాలు ఎంత మేరకు స్వా ధీనం చేసుకున్నారనేదానిపై స్పష్టత మాత్రం లేదు. విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు డ్రగ్స్ సరఫరా కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు అమలు చేస్తున్నా డ్రగ్స్ రాష్ట్రానికి ఎలా వస్తున్నాయ నేది అంతుచిక్కని ప్రశ్నగా మారుతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ డ్రగ్స్ వ్యవహారం బయటపడి కట్టడి అవుతుందా..?లేదా..? ఈడీ విచారణలతోనే షరామామూలే అన్నచందంగా మారు తుందా? అనేది వేచి చూడాలి.
– వేముల క్రాంతికుమార్, 9676717377