అమ్మాయిలు అభద్రత భావానికి లోను కావద్దు 

– హుస్నాబాద్ జూనియర్ సివిల్ జడ్జి శివరంజని 
నవతెలంగాణ-హుస్నాబాద్ రూరల్ : అమ్మాయిలు అభద్రత భావానికి లోను కాకుండా అన్ని సందర్భాలలో ధైర్యంగా ఉండాలని హుస్నాబాద్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శివరంజని అన్నారు. మంగళవారం హుస్నాబాద్ పట్టణంలోని సర్ సివి రామన్ ఇంగ్లీష్ మీడియం ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చట్టాలు, న్యాయవిజ్ఞాన అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి శివరంజని మాట్లాడుతూ సమాజంలో విస్తరిస్తున్న మాదకద్రవ్యాల పట్ల అపరిచిత వ్యక్తుల పట్ల  అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎవరి వల్లనైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు ఏ విధంగా స్పందించాలనే విషయాలను  విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అడ్వకేట్ జనరల్ రామకృష్ణ, హుస్నాబాద్ సివిల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మురళీమోహన్ ,పాఠశాల ప్రధానోపాధ్యాయులు కాయిత నారాయణరెడ్డి, జూనియర్ న్యాయవాదులు ,ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love