ప్రశ్నించే గొంతుకకు అవకాశం ఇవ్వాలే

– టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పోతు పెద్ది కిషన్ రెడ్డి
నవతెలంగాణ ముత్తారం
ప్రశ్నించే గొంతుకకు అవకాశం ఇవ్వాలని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు పోతుపెద్ది కిషన్ రెడ్డి అన్నారు.. శుక్రవారం ఓడేడు గ్రామంలో ఇంటింటి ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలతో మాట్లాడుతూ పార్లమెంట్‌ ఎన్నికల్లో బీఆర్ఎస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థిని అవకాశం కల్పించాలన్నారు. పెద్దపల్లి పార్లమెంట్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ను గెలిపిస్తే ప్రజల పక్షాన పోరాటం చేస్తాడని, ప్రజాసంక్షేమం కోసం ఆయన ఈనాటికి పని చేస్తూనే ఉన్నారని అన్నారు. కొప్పుల ఈశ్వర్‌ గెలుపుతో పేద వర్గాల భవిష్యత్‌ మారుతుందన ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నరేడ్ల రమేష్ నాయకులు రాజీ రెడ్డి ,సదానందం, పూదారి మహేందర్, దామోదర్ దాసరి వీందర్, అనంతుల రవీందర్ బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు
Spread the love