
పట్టణ కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ గ్లోబల్ ఐకాన్ 2024 అవార్డును అందుకుంది. ఢిల్లీకి చెందిన ప్రముఖ జాతీయ రీసెర్చ్ అండ్ ప్రైమ్ టైం ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో దేశంలోని స్వచ్ఛంద సేవా సంస్థలు, సామాజిక సేవనందిస్తున్న డాక్టర్లు, నాణ్యమైన విద్యను అందిస్తున్న పాఠశాలల పై చేపట్టిన సర్వేలో భీంగల్ లోని లిటిల్ ఫ్లవర్ ను ఉత్తమ పాఠశాల గా ఎంపిక చేశారు. ఈ మేరకు ఈనెల 11న ఢిల్లీలోని రెడిసన్ బ్లూ ప్లాజా హోటల్లో జరిగిన కార్యక్రమంలో మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ చేతుల మీదుగా అవార్డును పాఠశాల కరస్పాండెంట్ షఫీ కి అందజేశారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ షఫీ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఈ అవార్డు రావడం ఆనందంగా ఉందని తమ పాఠశాలలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ఐఐటి, నీట్ వంటి పరీక్షలలో విజయం సాధించి క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్నారని దీనిని గుర్తించి పాఠశాలకు అవార్డు రావడం జరిగిందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా తమ పాఠశాల ఎందుకు వెళ్తుందని షఫీ ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల బోధన సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.