పశుపోషణలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి

పశుపోషణలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలి– సేవా స్ఫూర్తి ఫౌండేషన్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ రత్నాకర్‌
– మైక్రో ల్యాబ్స్‌ మేనేజర్‌ డి.శంకర్‌
నవతెలంగాణ-మంచాల
పశుపోషణలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించాలని సేవా స్ఫూర్తి ఫౌండేషన్‌ ప్రాజెక్ట్‌ మేనేజర్‌ రత్నాకర్‌, మైక్రో ల్యాబ్స్‌ మేనేజర్‌ డి.శంకర్‌ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ఆరుట్ల రైతు వేదికలో సేవా స్ఫూర్తి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పాడి రైతులకు యాజమాన్య పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పాల్గొన్న వారు మీడియాతో మాట్లాడుతూ మంచి పాల దిగుబడి పొందడం కోసం చేపట్టాల్సిన చర్యలు, పశువులలో వచ్చే వ్యాధులపై నట్టల నివారణ, పొదుగు వాపు, వ్యాధి నిరోధక టీకాలు, సంకర జాతి పశువులలో వచ్చే పునరుత్పత్తి సమస్యలు, దాణా యాజమాన్యం, మేలైన పశు గ్రాసం, శుడి పశువుల జాగ్రత్తలు, షెడ్‌ నిర్వహణ, ఆధునిక యంత్రాల పై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ కొంగర విష్ణువర్ధన్‌ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కావలి శ్రీనివాస్‌, ఆదర్శ రైతు ప్రతాప్‌ రెడ్డి, మార సురేష్‌, రైతులు సి.హెచ్‌.నర్సింహ రెడ్డి, కష్ణ, ఆర్‌.ఐలయ్య , కొండల్‌ రెడ్డి,పీ.శ్రీనివాస్‌,తిరుపతి రెడ్డి,సత్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love