- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కార్మికులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుభవార్త చెప్పారు. క్యాబినెట్ సబ్‌కమిటీ నివేదిక మేరకు రాష్ట్రాన్ని 3 జోన్లుగా విభజించి.. కనీస వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించారు. పెంచిన వేతనాలు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయన్నారు. ‘‘జోన్ -1లో అన్‌స్కిల్డ్ కార్మికుల వేతనాన్ని రూ.12,750 నుంచి రూ.16 వేలకు, సెమీస్కిల్డ్ కార్మికుల వేతనం రూ.13,592 నుంచి రూ. 17 వేలకు, స్కిల్డ్ కార్మికుల వేతనాన్ని రూ.13,772 నుంచి రూ.18,500కి, హైస్కిల్డ్ కార్మికుల వేతనం రూ.14,607 నుంచి రూ.20 వేలకు పెంచాం’’ అని సీఎం వివరించారు.
- Advertisement -



