నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి: సీపీఐ(ఎం)

నవతెలంగాణ – మునుగోడు

వరి పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఎకరానికి రూ.15000 ఇవ్వాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి మిర్యాల భరత్ , రైతు సంఘం జిల్లా నాయకులు సాగర్ల మల్లేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రానికి చెందిన రేవెల్లి యాదయ్య తమ సొంత భూమిలో సాగుచేసిన వరి పంటకు అవసరమైన సాగునీరు అందించేందుకు భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటి పోవడంతో సాగు చేసిన వరి పంట పూర్తిగా ఎండిపోవడంతో గురువారం రైతు సంఘం ఆధ్వర్యంలో ఎండిన వరి పంటను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ ఏడాది వరి పంట సాగు చేసిన రైతులు వరి పొలాలకు అవసరమైన సాగునీరు అందక రైతులు తీవ్రంగా నష్టపోయారని తక్షణమే ప్రభుత్వం నష్టపోయిన పంటలను గుర్తించి రైతులకు నష్టపరిహారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల నాయకులు యాసరాణి శ్రీను , యాదయ్య , వేముల లింగస్వామి , శివర్ల వీరమల్లు తదితరులు ఉన్నారు.
Spread the love