ప్రజా ఆరోగ్యంపై రాష్ట్ర సర్కారు ప్రత్యేక దృష్టి: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

నవతెలంగాణ – వేములవాడ
ప్రజా ఆరోగ్యం పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ అర్బన్ మండలం రుద్రవరం గ్రామంలో బుధవారం నూతనంగా రూ.25 లక్షలతో  నిర్మించబోతున్న ప్రభుత్వ నూతన హెల్త్ సబ్ సెంటర్ నిర్మాణానికి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజారోగ్యమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు వైద్యరంగానికి ప్రాధాన్యమిస్తున్నదన్నారు..హెల్త్ సబ్ సెంటర్ ఏర్పాటుతో ప్రతీ పల్లెలో ప్రజల చెంతకే వైద్యం చేరుతోందని దీని వలన ప్రజల ఆరోగ్య పరిస్థితి మెరుగు పడుతుందన్నారు. నగరాలకు వెళ్లి కార్పొరేట్ ఆస్పత్రుల్లో వైద్యం కోసం లక్షలు ఖర్చుపెట్టే భారం ప్రజలకు తగ్గుతుందని తెలిపారు. పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ పరిమితిని 10 లక్షల వరకు పెంచడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక జడ్పిటిసి మ్యాకల రవి, రుద్రవరం సింగిల్ విండో చైర్మన్ రేగులపాటి
Spread the love