టీయూడబ్ల్యూజే(ఐజేయు) మీడియా డైరీ ఆవిష్కరించిన ప్రభుత్వ విప్

– జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ
నవతెలంగాణ – వేములవాడ
జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) మీడియాడైరీ-2024ని  గురువారం తన క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ డైరీలో పొందుపరిచిన సమాచారం జర్నలిస్టులకే కాకుండా ప్రభుత్వ అధికారులకు సైతం ఎంతో ఉపయోగకరంగా ఉందని అంటూ టీయూడబ్ల్యూజేను అభినందించారు. మీడియాతో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందని అన్నారు, నా రాజకీయ ఎదుగుదలలో మీడియా పాత్ర గణనీయంగా ఉందన్నారు.  ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లకుండా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాల్సిన బాధ్యత మీడియాపై ఉంటుందన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో టీయుడబ్ల్యూజే ఐజేయూ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్, రాష్ట్ర  కార్యనిర్వాహక మండలి సభ్యులు దాసరి దేవేందర్, జిల్లా కార్యదర్శి ముత్యం, కోశాధికారి సతీష్, జిల్లా ఉపాధ్యక్షులు తడక శ్రీనివాస్,  వేములవాడ ప్రెస్ క్లబ్ ఫౌండర్ రేగుల దేవేందర్, వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టపాక లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి నూగురి మహేష్, , దాడుల నివారణ కమిటీ కన్వీనర్ కొక్కుల శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి తుపుకారి శ్రీనివాస్, సూర్యకిరణ్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీ కొత్త హరి,జిల్లా కమిటీ సభ్యులు గంగుల రవికుమార్, శ్రీరాముల శ్రీధర్, మంగళగిరి శ్రీనివాస్, వేములవాడ ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు ప్రశాంత్, జాయింట్ సెక్రటరీ దూలం సంపత్, కోశాధికారి మధిరాల నరేష్, కార్యవర్గ సభ్యులు మ్యాన శ్రీనివాస్, గుడిసె కిషన్, ఉల్లందుల మల్లేశం,మద్దిరాల నరేష్, హబీబ్ పాషా, చందుర్తి ,కోనరావుపేట, రుద్రంగి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్, దేవారెడ్డి,అంజన్న, సిటీ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్ పాల్గొన్నారు.
Spread the love