Wednesday, May 6, 2026
E-PAPER
Homeజాతీయంటీవీకే చీఫ్ విజయ్‌కు గవర్నర్ షాక్

టీవీకే చీఫ్ విజయ్‌కు గవర్నర్ షాక్

- Advertisement -

నవతెలంగాణ-హైద‌రాబాద్‌: టీవీకే చీఫ్ విజయ్‌కు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ షాక్ ఇచ్చారు. తగినంత మెజారిటీ చూపించలేకపోవడంతో విజయ్ ప్రభుత్వం ఏర్పాటుకు గవర్నర్ అనుమతి నిరాకరించారు. ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేలు తప్పనిసరని గవర్నర్ స్పష్టం చేశారు. దీంతో తక్షణం ప్రభుత్వం ఏర్పాటుపై సస్పెన్స్ కొనసాగుతోంది. ప్రభుత్వం ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల బలం అవసరం కాగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి టీవీకే వద్ద ప్రస్తుతం 112 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. విజయ్ రెండు సీట్లలో గెలవడంతో ఒక సీటును వదులుకోవడం అనివార్యం. దీంతో టీవీకే చేతిలో 107 మంది సభ్యుల బలం మాత్రమే ఉన్నట్టయింది. కాంగ్రెస్ బలం కూడా కలిపితే టీవీకే బల నిరూపణకు మరో 6 మంది ఎమ్మెల్యేలు అవసరం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -