నవతెలంగాణ-హైదరాబాద్: కాసేపట్లో ఉప్పల్ వేదికగా పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్‌ల మధ్య మ్యాచ్ మొదలుకానుంది. సొంతగడ్డపై నైట్‌రైడర్స్ చేతిలో ఓడిన సన్‌రైజర్స్ అచ్చొచ్చిన ఉప్పల్‌లో పుంజుకునేందుకు ఎదురుచూస్తోంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానం వేటలో పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పోటీపడుతున్నాయి. ముల్లాన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్‌పై భారీ స్కోరు చేసినా ఓటమి పాలైన సన్‌రైజర్స్ ఆ తర్వాత బౌలింగ్ విభాగంలో విప్లవాత్మక మార్పులు చేసింది. యువ పేసర్లకు అవకాశం అందించి అద్భుతాలు రాబట్టింది. మరో వైపు పంజాబ్ కింగ్స్ రెండు పరాజయాలతో సతమతం అవుతోంది. ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్‌కు డోకా లేదు కానీ టాప్-2లో నిలిచే అవకాశాలను మరో ఓటమి దెబ్బకొట్టగలదు. అయితే, పంజాబ్ కింగ్స్‌ను బోల్తా కొట్టించేందుకు సన్‌రైజర్స్ నేడు తొలుత బౌలింగ్ చేస్తుందేమో చూడాలి.
IPL: కాసేపట్లో పంజాబ్ కింగ్స్ వర్సెస్ సన్‌రైజర్స్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


