ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం..

– ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నాణ్యమైన విద్య 
– ప్రభుత్వ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ బంటు కవిరాజు 
నవతెలంగాణ – నెల్లికుదురు 
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభమైనయని అందులోని నాణ్యమైన విద్య అందుతుందని ఆ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపాల్ బంటు కవిరాజు అన్నారు సోమవారం వివిధ గ్రామాలలో కళాశాల అడ్మిషన్ల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సరం అడ్మిషన్లు ప్రారంభమైన కనుక పదవ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థిని విద్యార్థులు ఉచితంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ ఇవ్వబడుతున్నాయని దీనిని ప్రత్యేక విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని అన్నారు ఈ కళాశాలలో ఎంపీసీ మరియు బైపీసీ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సిఇసి హెచ్ఇసి తోపాటు ఒకేషనల్ డైరీ సెరికల్చర్ మరియు ఈ ఈ టి వివిధ కోర్సులలో ఈ కళాశాలలో అడ్మిషన్లు ఉన్నాయి కనుక వివిధ గ్రామాలకు చెందిన ప్రతి విద్యార్థిని ఉచితంగా అడ్మిషన్ పొందవచ్చు అని అన్నారు. ఈ కళాశాలలో ఉచితంగా ఇంటర్ విద్య  చేరిన వారి కోసం అడ్మీషన్ ఫీజు లేకుండా ఉచితంగా అడ్మిషన్ ఇవ్వబడును అని అన్నారు దీంతో పాటు ఉచితంగా పాఠ్యపుస్తకాలు.అందరికి స్కాలర్ షిప్. బస్ పాస్ సౌకర్యం. కలదని తెలిపాడు మరియు విద్యార్థిని విద్యార్థులకు క్రీడల్లో రాణించిన విద్యార్థులకు ప్రోత్సాహం. NSS క్యాంపుల నిర్వహణ. విశాలమైన నూతన భవన సముదాయం. అధునాతన లాబోరేటరీలు.అర్హత, అనుభవం కల్గిన అధ్యాపక బృందం.స్లిప్ టెస్ట్ లు, వారాంతర పరీక్షల నిర్వహణ.స్టడీ అవర్స్ నిర్వహణ. వెనుకబడిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ. కల్పించబడనని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ మర్సకట్ల అనిల్ కుమార్ అధ్యాపకులు శ్రీనివాస్, నాగేశ్వరరావు, మహేందర్, సతీష్, యాకన్న, సుభాష్ అధ్యాపకేతర బృందం గౌరీ, లక్ష్మణ్, మంగమ్మ,  రమ తదితరులు పాల్గొన్నారు.
Spread the love