నులి పురుగు నివారణ మాత్రల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ ఆది..

– ప్రైవేటు పాఠశాలకు దీటుగా సర్కార్ బడుల్లో నాణ్యమైన విద్య..
నవతెలంగాణ – వేములవాడ 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం,ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా గురువారం వేములవాడ పట్టణంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే, తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ రెసిడెన్షియల్ బాలుర,బాలికల,తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర,బాలికల,కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థులకు నులిపురుగుల నివారణకు అల్బెండజోల్‌ మాత్రలను ప్రభుత్వ విప్ స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పంపిణీ చేశారు..అనంతరం పాఠశాలలను తనిఖీ చేసి తన దృష్టికి వచ్చిన పలు సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు.. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ.. విద్యార్థులతో కాసేపు మాట్లాడారు ఏమైనా సమస్యలు ఉంటే ఉపాధ్యాయులకు లేదా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. 1 నుంచి 19 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలందరూ తప్పకుండా నులిపురుగుల నివారణ మాత్రలను వేసుకోవాలని అన్నారు. ప్రతి సంవత్సరం రెండు సార్లు నిర్వహించాడం జరుగుతుందన్నారు.
శరీకకంగా బలంగా ఉన్నప్పుడే మనం చదువులోరాణించగలుగుతామన్నారు. నులిపురుగుల ద్వారా పిల్లల్లో శారీరక ఎదుగుదల ఉండక పోవడం, వ్యాధి నిరోధక శక్తి తగ్గతుందన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పకుండా నులిపురుగుల నివారణ మాత్రలు వేయించాలన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గురుకులలో నాణ్యమైన విద్యను అందిస్తున్నాం అన్నారు. పాఠశాలలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావలన్నారు. పాఠశాల విద్యార్థులుకు విద్యార్థి వయసు మళ్ళీ రాదని ,తల్లిదండ్రులు మీ పై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండి పుస్తకాల పురుగుల వలె కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయిలో ఎదగాలని అన్నారు.గతంలో చాలామంది విద్యార్థులు పదవ తరగతి ,ఇంటర్ తర్వాత పై చదవులు, చదువుకోలేక బొంబాయి, దుబాయ్ లాంటి ప్రాంతాలకు వెళ్లేవారని కానీ వైఎస్ రాజశేఖర్ రెడ్డ ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించి ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలను ప్రైవేటు పాఠశాలకు దీటుగా బలోపేతం చేస్తున్నామన్నారు.రాష్ట్ర చరిత్రలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ప్రైవేటు పాఠశాలకు దీటుగా ఉంటారని రవీంద్రభారతిలో గత సంవత్సరం పడవ తరగతిలో 10/10 సాధించిన విద్యార్థులను ఘనంగా సన్మానించారని గుర్తు చేశారు.వేములవాడ పరిధిలో ఎంతమంది విద్యార్థులు పదవ తరగతిలో 10/10 సాధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానిస్తానని హామీ ఇచ్చారు. పదవ తరగతి విద్యార్థులు 10/10 సాధించి వేములవాడ రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండే విధంగా ఉండాలన్నారు. విద్యార్థిని, విద్యార్థులకు తన వంతు ప్రోత్సాహకం సహకారం ఎల్లవేళలా ఉంటుందన్నారు.ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ సుమన్ మోహన్,ఆర్డీఓ రాజేశ్వర్ , మున్సిపల్ కమిషనర్ అవినాష్,పట్టణ సిఐ వీర ప్రసాద్,మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్,ఆయా పాఠశాల ప్రిన్సిపాల్ లు,కౌన్సిలర్లు,వైద్య సిబ్బంది, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
Spread the love