గౌడ సంఘం ఐక్యవేదిక పోస్టర్ ను ఆవిష్కరించిన సంఘం నాయకులు

– 10వ తారీఖున ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ సోదరుల ఆత్మీయ సమ్మేళనం
 – విజయవంతం చేయాలని తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ పిలుపు
నవతెలంగాణ – వేములవాడ
వేములవాడ పట్టణంలోని తిప్పపుర్ తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ సంఘం ఐక్యవేదిక పోస్టర్ ఆవిష్కరించిన వేములవాడ గౌడ సంఘం నాయకులు.. ఈ సందర్భంగా తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్   మాట్లాడుతూ.. మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ విద్యార్థి దశలోనే రాజకీయ అరంగ్రేటం ఎన్ ఎస్ యు ఐ అధ్యక్షులు గా విద్యార్థుల సమస్యల పరిష్కారించి ఎంతో కృషి చేశారని వారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర మార్కుపెడ్ చైర్మన్ గా జిల్లాలో పశుదాన తయారీ కేంద్రము నెలకొల్పి 200 కుటుంబాలకు జీవన ఉపాధి కల్పించారు. మార్కెట్ రంగంలో పెను మార్పులు తీసుకో వచ్చిన ప్రభాకర్ నిరంతరం శ్రమిస్తూ పార్లమెంట్ సభ్యులు గా అనేక సేవలందించారు.  జిల్లా కేంద్రంలో పాస్ పోర్ట్ కేంద్రం ,కేంద్రీయ విద్యాలయం కరీంనగర్ నుండి తిరుపతికి రైలు ప్రారంభించడం, వేములవాడ మండలంలోని నాంపల్లి వద్ద బీడీ కార్మికులకు నిరంతర వైద్యశాల ఏర్పాటు చేయడం అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈనెల 10 తారీఖున ఉమ్మడి కరీంనగర్ జిల్లా గౌడ సోదరుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సీనియర్ అడ్వకేట్ నేరెళ్ల తిరుమల్ గౌడ్, గౌడ మాజీ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్, ఎంపీటీసీ రంగు వెంకటేశం గౌడ్, సర్వాయి పాపన్న గీతకార్మిక సంఘం అధ్యక్షులు సంపునురి మల్లేశం గౌడ్,  పట్టణ గౌడ్ అధ్యక్షులు కైరి పరుశురాం గౌడ్, గోపా అధ్యక్షులు దూలం సంపత్ గౌడ్, సెటిలర్ గౌడ అద్యక్షులు పొన్నంరవి చంద్ర గౌడ్, గుడిసెలశ్రీనివాస్ గౌడ్, వస్తాద్ కృష్ణ గౌడ్, బత్తిని ఎల్ల గౌడ్, గజ్జలపర్శరం గౌడ్, పొత్తూరి శ్రీనివాస్, కదిరే రాజు గౌడ్, తో పాటు తదితరు పాల్గొన్నారు.
Spread the love