ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

– మున్సిపాలిటీ  ఛైర్మన్ శాగంటి అనసూయ రాములు
నవతెలంగాణ – తిరుమలగిరి
మున్సిపాలిటీ పరిధి 08వవార్డు అనంతారం లో  మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మున్సిపల్ ఛైర్మన్ శాగంటి అనసూయ రాములు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలన్నారు. రైతులు దళారులను నమ్మకుండా ధాన్యాన్ని శుభ్రం చేసుకుని తాలు లేకుండా చేసి నాణ్యమైన ధాన్యాన్ని నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర పొందాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తుందని అన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటా రూ.2203 రూపాయలకు గాను కామన్ గ్రేడ్ ధాన్యానికి క్వింటా రూ 2183 రూపాయల మద్దతు ధర పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దాచేపల్లి వెంకన్న, కౌన్సిలర్ భాస్కర్ నాయక్,వీరు నాయక్,తిరుమణి యాదగిరి, సుంకరి లక్ష్మణ్, మొగుళ్ళ జితేందర్,కారుపోతుల యాదగిరి,నర్సయ్య, మాధ వెంకన్న, కన్నెబోయిన సాయిలు, కడమంచి శ్రీను, కళ్లెం శ్రీను, యాదగిరి,రంగు అంజయ్య, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love