
మోపాల్ మండలంలోని బోర్గం పి ప్రభుత్వ పాఠశాలలో గురువారం రోజున బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు బతుకమ్మ ఆడుతూ, పాఠశాలలో సందడి చేశారు అలాగే బతుకమ్మ పండుగ గొప్పతనము మరియు తెలంగాణ సంస్కృతి గురించి ప్రధానోపాధ్యాయుడు శంకర్ విద్యార్థినీ విద్యార్థులకు తెలియచెప్పాడు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.