ఘనంగా సీత్లా భవాణి పండుగ వేడుకలు 

Grand celebration of Seetla Bhavani festivalనవతెలంగాణ – బొమ్మలరామారం
గిరిజనుల ఆరాధ్యదైవం సీత్లా భవాని పండుగ మహిళలు మంగళవారం బోనాలు సమర్పించి సీత్లా పండుగను ఘనంగా జరుపుకున్నారు. మండలం గోవింద్ తండా లో గిరిజన మహిళలు డప్పు వాయిద్యాలతో నృత్యాలు చేస్తూ బోనాలతో వచ్చి అమ్మవారికి సమర్పించారు.సీత్ల పండుగ జరుపు కోవడం వల్ల వర్షాలు బాగా కురవాలని పంటలు బాగా పండుతాయని,ప్రజలు, పశువులు ఆరోగ్యంగా ఉంటారని,తండాలో యేటా ఈ పండుగను పురస్కరించుకొని బోనాలతో అమ్మవారికి అర్పించడం ఆనవాయితగా వస్తుంది.ఈ కార్య క్రమంలో మాజీ కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు ధీరావత్ రాజేష్ నాయక్, మంగ్లీ, రవీందర్, రమేష్, బిక్కు, రవీందర్, సురేష్, అనిల్, లక్ష్మిరాం భాస్కర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Spread the love