నవతెలంగాణ- కుభీర్ : మండల కేంద్రమైన కుభీర్ తో పాటు పార్డి (బి ), పల్సి, సోనారి, మలేగాం తదితర గ్రామాల్లో గురువారం 16వ విశ్వ కర్మ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్బంగా పార్డి (బి ) విశ్వ కర్మ సంఘం అధ్యక్షులు మండజీ లింబాద్రి ఆధ్వర్యంలో జెండా ఎగురావేసి అయన చిత్ర పటానికి పూజలు చేసి నివాళులు అర్పించారు. ఈ సమావేశంలో సంఘం అధ్యక్షులు లింబాద్రి మాట్లాడుతూ.. విశ్వకర్మలకు ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించి వారికి రాయితీపై రుణాలు అందించి ఆదుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మడి ప్రవీణ్ కుమార్, మండల అధ్యక్షులు కట్టల లక్ష్మణ్, మాజీ జడ్పీటీసీ వి మోహన్ మాజీ సర్పంచులు రాజేశ్వర్ మల్లన్న, రాజన్న, చంద్రశేఖర్, మాజీ ఎంపీటీసీ కానోబా, గ్రామస్తులు బ్రాహ్మదాస్, నారాయణ్, చంద్రకాంత్, విశ్వబ్రాహ్మణ కుల సంఘ సభ్యులు తదితరులు ఉన్నారు.
ఘనంగా విశ్వ కర్మ జయంతి వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



