ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద సొంత నిధులతో బోరు ప్రారంభం
నవతెలంగాణ-ఆత్మకూర్
ఆత్మకూరు పట్టణంలోని మూడవ వార్డులో లైట్లను బీజేపీ రాష్ట్ర నాయకులు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి, జిల్లా నాయకులు అయ్యగారి ప్రభాకర్ రెడ్డితో పాటు బీజేపీ కౌన్సిలర్లు కలిసి గురువారం నూతన ఐమాక్స్ లైట్లను ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో బీజేపీ నాయకులు బంగ్లా లక్ష్మి కాంత్ రెడ్డి స్వయంగా తమ సొంత నిధులతో వేయించిన బోరును ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఈ బోరు వల్ల కళాశాల విద్యార్థులకు, తాగునీటి ఇబ్బందులు తొలగిపోనున్నాయన్నారు.
బీజేపీ అంటేనే అభివృద్ధి అనీ, మేము అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజల సమస్యల పరిష్కారమే మా ప్రాధాన్యత అని అన్నారు. రాబోయే రోజుల్లో ఆత్మకూరు పట్టణాన్ని అన్ని వార్డుల్లో అభివృద్ధి పథంలో నడిపిస్తాం” మన్నారు. కళాశాలకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే ఎంపీ డీకే అరుణ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు.
డిగ్రీ కళాశాలకు బోర్ వేయించి ప్రారంభం చేయటం పట్ల అధ్యాపక బృందం విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. దీనికి ముందు ప్రధానమంత్రి జన్మదినం సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పండ్లు, బ్రెడ్ పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు భరత్, జిందె జ్యోతి శ్రీనివాస్, చెట్ల లలిత తోపాటు నాయకులు, ఆంజనేయులు. అశ్విని కుమార్, సామద్, బి రాము, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.



