ఆళ్ళపల్లిలో ఘనంగా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

నవతెలంగాణ – ఆళ్ళపల్లి
జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఆళ్ళపల్లి మండల వ్యాప్తంగా వివిధ కార్యాలయాల్లో మండల, గ్రామ పంచాయతీ అధికారులు, ప్రజా ప్రతినిధులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. పలుచోట్ల జరిగిన ఈ ఉత్సవాల్లో స్థానిక ఎంపీపీ కోండ్రు మంజు భార్గవి, జెడ్పీటీసీ కొమరం హనుమంతరావు, తహసీల్దార్ శకుంతల, ఎంపీడీవో రమాదేవి, ఎస్సై ఈ.రతీష్, ఎంపీఓ బత్తిన శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.
Spread the love