ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు 

నవతెలంగాణ – నెల్లికుదురు 
మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి నెల్లికుదురు రావిరాల మునిగలవీడు గ్రామాలతో పాటు వివిధ గ్రామాలలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం ఆంజనేయ భక్తులతో కలిసి గ్రామ ప్రజలు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన భక్తులు మొక్కిన మొక్కులు చెల్లించుకుంటూ నూతన మొక్కలను కోరుకుంటూ ఆంజనేయస్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించి ఆయా గ్రామాలలో అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. నిగలవేడు గ్రామంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. రావిరాల గ్రామంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆదేశానుసారం ఘనంగా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమoలో అకిరా నాగేంద్ర చారి  పల్లె రవికుమార్ నల్లని పాపారావు స్థానిక ఎంపిటిసి శోభారాణి మరియు ఆర్యవైశ్య సంఘం గుంటూరు శ్రీనివాస్ ఉమామహేశ్ వివిధ గ్రామాల హనుమాన్ భక్తులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Spread the love