మండలంలో ఘనంగా గణతంత్ర దీనోత్సవ వేడుకలు 

నవతెలంగాణ – బెజ్జంకి 
వందేమాతరం..వందేమాతరం జాతీయ గీతం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో విద్యార్థుల నినాదాలతో మారుమ్రోగింది. సంస్కృతములో బంకించంద్ర ఛటర్జీ రచించిన ఈ గీతం దేశంలో బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సాగిన ప్రజా ఉద్యమంలో భారతీయుల జాతీయతా భావాలను, రాజకీయ చైతన్యాన్ని ఇనుమడింపజేసింది. సుప్తచేతనావస్థితిలో ఉన్న జాతిని మేల్కొలిపి స్వాతంత్య్ర పోరాటానికి సంసిద్ధులను చేసి స్వాతంత్ర్య జాతీయోద్యమ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా నిలిచిపోయి స్వాతంత్ర్యం సిద్దించింది. అనాడు సధించిన స్వాతంత్ర్య ఫలాలు పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చిన రోజును భారతదేశం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాము. శుక్రవారం మండలంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా నిర్వహించారు. మండలంలోని అయా పాఠశాలల విద్యార్థులు గణతంత్ర దినోత్సవ ర్యాలీలో స్వాతంత్ర్య ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన మహనీయుల వేషధారణలు ప్రత్యేకార్షణగా నిలిచాయి. తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, పోలీస్ స్టేషన్, ఆరోగ్య కేంద్రం, పశువైద్యశాల కార్యాలయాల్లో తహసీల్దార్ ఎర్రోల్ల శ్యామ్, ఎంపీడీఓ దమ్మని రాము, ఎంఈఓ పావని, ఎస్ఐ నరేందర్ రెడ్డి, వైద్యాధకారి వినోద్ బాబ్జీ, పశువైద్యాధికారి శ్రీకాంత్ రెడ్డి ,పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ద్యావనపల్లి మంజుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, అయా పాఠశాలల బోధన సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్థులు హజరయ్యారు.
స్టీల్ వస్తువుల ప్రదర్శన..ప్లాస్టిక్ నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలనే సంకల్పంతో గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ ద్యావనపల్లి మంజుల అధ్వర్యంలో స్టీల్ వస్తువుల ప్రదర్శన చేపట్టారు.అందరూ ప్లాస్టిక్ వస్తువుల వినియోగాన్ని నివారించి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని సర్పంచ్ మంజుల ప్రజలకు సూచించారు. పంచాయితీ కార్యదర్శి ప్రనీత్ రెడ్డి,గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు హజరయ్యారు.
Spread the love