బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు 

నవతెలంగాణ – పెద్దవంగర
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా నిర్వహించిన రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు ఘనంగా ముగిశాయి. అందులో భాగంగా సోమవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఈదురు ఐలయ్య పార్టీ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..గత తొమ్మిదేళ్ల కాలంలో రాష్ట్ర సంక్షేమానికి కేసీఆర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. బంగారు తెలంగాణ కోసం ఆయన నిర్వీర్యామంగా పనిచేశారని ప్రశంసించారు. అమలు కానీ హామీలిచ్చి గద్దెకెక్కిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. కార్యక్రమంలో పాలకుర్తి దేవస్థాన మాజీ చైర్మన్ వెనుకదాసుల రామచంద్రయ్య శర్మ, మండల పార్టీ ఉపాధ్యక్షుడు కనుకుంట్ల వెంకన్న, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు దుంపల సమ్మయ్య, గ్రామ పార్టీ అధ్యక్షులు రెడ్డబోయిన గంగాధర్, ఆరుట్ల వెంకట్ రెడ్డి, బానోత్ శ్రీను, మాజీ సర్పంచ్లు చింతల భాస్కర్, నూనవత్ బాలు, మాజీ ఉప సర్పంచులు మొర్రిగాడుదుల శ్రీనివాస్, శ్రీరాం రాము, గద్దల వెంకన్న లచ్చయ్య సత్యనారాయణ రమేష్ అనుదీప్ వెంకటేష్ చంద్రబోస్ యేసయ్య పాల్గొన్నారు.
Spread the love