ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు..

నవతెలంగాణ – తుంగతుర్తి
నాలుగు కోట్ల ప్రజల హృదయాలు ఆనందంతో ఉప్పొంగే పర్వదినం,తెలంగాణ అస్తిత్వానికి,ఆత్మగౌరవానికి పట్టాభిషేకం జరిగి దశాబ్ద కాలం పూర్తి అయిందని,రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ఈ సందర్భంగా ప్రత్యేక నివాళులు అర్పిస్తున్నట్లు మండల పరిధిలోని అన్నారం పంచాయతీ కార్యదర్శి దుండి రమేష్ అన్నారు.ఆదివారం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు.ఈ మేరకు అవమానాలు,అసమానతలను అంతం చేస్తూ,ఆత్మగౌరవ ఉద్యమమే ఊపిరిగా 60 ఏళ్ల కల సాకారం కావడంలో అసువులు బాసిన అమరులను స్మరిస్తూ,ప్రతి ఒక్కరికి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గోపాలమిత్ర కుంచాల శ్రీనివాస్ రెడ్డి, అంగన్వాడీ టీచర్లు మాధవి, మంగమ్మ,ఉమ,కళమ్మ,భాగ్యమ్మ,కారోబార్ మంగళపెళ్లి అనిల్,పాలబిందెల జానయ్య,గుండాల శివ, గ్రామపంచాయతీ సిబ్బంది అసానాబాద సత్యనారాయణ,బోసు,సోమలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Spread the love