గిరిజనుల పండగ తీజ్ ఉత్సవాలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పాలిటెక్నిక్ మైదానంలో పెద్ద ఎత్తున మహిళలు, యువతులు, యువకులు, అందరూ కలిసి గిరిజనులు సాంప్రదాయ వేషాధారణలో ప్రత్యేక పూజలు చేసి ఘనంగా ఆదివారం నిర్వహించారు. జగదంబ మాతకు తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేకలను బలిచేసి అందరూ కలిసి భోజనాలు చేశారు. మహిళలు, యువతులు సాంప్రదాయం నృత్యాలు చేసి తమ భక్తిని చాటుకున్నారు. బంజారా, లంబాడీ సంస్కృతి సాంప్రదాయానికి చాటి చెప్పే పండుగలలో అతి ముఖ్యమైనది తీజ్ పండుగ. తీజ్ అనగా గోదుమ మొలకలు అని అర్థం. ఈ పండుగను పెళ్ళి కాని అమ్మాయిలు శ్రావణ మాసంలో భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా డాక్టర్ హరికృష్ణ, డాక్టర్ బిలోజి నాయక్, డాక్టర్ మోతిలాల్, చాంగు బాయ్, చంద్రకళ, సులోచన, మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లా బంజార సభ్యులందరికీ తీజ్ పండగ శుభాకాంక్షలు తెలియజేశారు. నియమా ఇష్టాలతో ఆధ్యాత్మిక గురువైన జగదాంబ మాత సేవలాల్ మహారాజ్ నా ఆశీర్వాదంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తు తరాలకు తమ తీజ్ పండగ ప్రాముఖ్యతను తెలపడానికే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. పండుగ ముఖ్య ఉద్ధేశ్యం తరతరాల నుండి వస్తున్న బంజారా సంస్కృతి సాంప్రదాయాలను రక్షించడం ఆ రోజు తాండ నాయకుని ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహిస్తూ తాండ నాయక్ ఇతర తాండ పెద్దలను గౌరవించడం అని తెలియజేశారు. తాండలో వర్షాలు బాగా కురిసి ప్రతి తాండ ప్రకృతి పచ్చదనంతో కళకళలాడుతూ ఎప్పుడు పచ్చగా హరిత భరితంగా ప్రసంగించారు ఉండడం. పెళ్ళి కాని అమ్మాయిలకు చక్కటి భర్త దొరకాలని అన్ని కోరికలు నెరవేరాలని అమ్మాయిలు కోరుకోవడం అని తెలియజేశారు.
అలాగే నిజామాబాద్ జిల్లాలోని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామన్నారు.పండుగను తొమ్మిది రోజులు ఘనంగా జరుపుకుంటారు అని తెలియజేశారు. శ్రావణ మాసంలో వచ్చే రాఖీపూర్ణిమ రోజు ప్రారంభమై గోకులాష్టమి రోజున ముగుస్తుంది అని తెలియజేశారు. పెళ్ళికాని అమ్మాయిలు అందరు పాటలు పాడుతూ, నాట్యం చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు అని తెలిపారు. వెదురు బుట్టల్లోనే కాకుండా మోదుగు ఆకులతో గుల్లగా చేసి అందులో మట్టిని పోసి, గోదుమలని చల్లుతారు. పెళ్ళికాని ఆడ పిల్లలు ప్రతిరోజు మూడు పూటలు అందంగా ముస్తాబై వెదురు బుట్టల్లో ఉన్న గోదుమలకు నీల్లు జల్లుతారు అని తెలియజేశారు. ఐతే ఈ కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలు పులియాగెణో పూర్ణకుంభం తలపై పెట్టుకొని బావి నీళ్లుకాని, బోరింగ్ నీళ్ళుకాని, చెరువు నీళ్లుకాని, తీసుకు వచ్చి తీజ్ కి పోస్తారు. ఈ కార్యక్రమం జరిగేటప్పుడు పెళ్ళికాని మగపిల్లలు తీజ్ కి నీళ్ళ పోయ్యనివ్వకుండా ఆపి కొన్ని పొడుపు కథలు వేస్తారు. వాటికి సమాధానం చెప్పినవారికి తీజ్ కి నీళ్ళు పొయ్యనిస్తారు. ఈ విధంగా రోజుకు మూడు పూటల పాటలు పాడుతూ, నృత్యాలు చేస్తూ నీళ్ళు జల్లుతూ అగరు బత్తులతో దూపం చేస్తూ నైవేద్యం పెడుతూ ఆనందంగా ఈ పండుగను నిర్వహించుకుంటారు అని క్లుప్తంగా వివరించారు. పాలిటెక్నిక్ మైదానం నుండి ప్రారంభమైన ర్యాలీ కలెక్టరేట్ మైదానం వరకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బంజారా ల యువతి, యువకులు,వారి తల్లిదండ్రులు, బంజారా కులస్తులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.