
మండల కేంద్రంలోని ఎంపీడీఓ సమావేశ కార్యాలయంలో మండలంలోని అయా గ్రామాల సర్పంచులను సోమవారం మండల పరిషత్ అధ్వర్యంలో శాలువా కప్పి ఘనంగ సన్మానించారు. గ్రామాలాభివృద్ధిలో సర్పంచులు పాత్ర కీలకపాత్ర పోషించారని ప్రజాప్రతినిధులు,అధికారులు అభినందించారు. ఎంపీపీ నిర్మల,జెడ్పీటీసీ కడగండ్ల కవిత,ఏఎంసీ చైర్మన్ కచ్చు చంద్రకళ,వైస్ ఎంపీపీ చెలుకల సభిత,ఎంపీడీఓ దమ్మని రాము,ఎంపీఓ విష్ణు వర్ధన్,పంచాయతీ కార్యదర్శులు హజరయ్యారు.