మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా : జీఎస్‌ఆర్‌

మండలాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేస్తా : జీఎస్‌ఆర్‌నవతెలంగాణ-శాయంపేట
ఈనెల 30న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో తన కు అవకాశం కల్పిస్తే శాయంపేట మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని భూపాలపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మండలంలోని నేరేడుపల్లి, అప్పయ్యపల్లి, ప్రగతిసిం గారం గ్రామాల్లో ప్రజా దీవెన యాత్ర కార్యక్రమంలో భా గంగా గురువారం జిఎస్‌ఆర్‌ ఇంటింటి ప్రచారం నిర్వ హించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదే ళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో శాయంపేట మండలం అభివృ ద్ధికి ఆమడ దూరంలో ఉందని, కాంగ్రెస్‌ పార్టీలో గెలిచి అభివద్ధి కోసం టిఆర్‌ఎస్‌ పార్టీలోకి వెళ్లానని చెబుతున్న స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి ఇల్లు లేని నిరుపేదలకు డబల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు ఇప్పించలేదని మండిపడ్డారు. మండల కేంద్రానికి కనీసం అంబులెన్స్‌ సౌకర్యం కల్పించలేని అసమర్థులని, కుటుంబ సభ్యుల పదవుల కోసం కాపాడుకోవడానికి పార్టీ మారారని విమ ర్శించారు. రెండుసార్లు ఓటమిపాలైన ప్రజా సమస్యల పై అనునిత్యం పోరాటం చేస్తున్నానని, నాకు ఒక అవ కాశం ఇచ్చి ఎమ్మెల్యే గా గెలిపిస్తే పాలేరులా పనిచేసి మీ సమస్యల పరిష్కారం దిశగా పయనించి మండల అభివద్ధికి కషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల పార్టీ అధ్య క్షులు దూదిపాల బుచ్చిరెడ్డి, మాజీ జడ్పిటిసి చల్ల చక్ర పాణి, నాయకులు పోలపల్లి శ్రీనివాస్‌రెడ్డి, చిందం రవి, మారపల్లి బుజ్జన్న, దుబాసి కష్ణమూర్తి, డిజె నాగరాజు, వడ్డేపల్లి శ్రీనివాస్‌, భాస్కర్‌, రాజు, వీరన్న, ఆదిరెడ్డి, మో ర శీను,రాజిరెడ్డి, సుధాకర్‌ రెడ్డి, అశోక్‌, తిరుపతి, శ్రీనివా స్‌, తదితరులు పాల్గొన్నారు.

Spread the love